పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/700

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

క. మ్రుచ్చులవెత లేకుండఁగ,
      నిచ్చలుఁ బరికించి యెందు నెఱి చెడకుండన్
      హెచ్చుగఁ గాఁపుల మేలును,
       నచ్చుపడం బుడమియేలి కారయ వలయున్.

క. కలిమియుఁ జదువును జాలం,
       గలిగినచో మిడిసిపడక కడు నడఁకువతో
        మెలఁగం జను నెల్లరకును,
         దలకూడును బేరుఁ బెంపుఁ దద్దయు దానన్.

క. చాలఁగఁగీ డగనుపుడును, దాలిమియేపూనవలయుఁదప్పక దానన్
      మేలిమి చెందును మానిసి, నేలంగలవారిలోన నెగులర యడఁగన్

క. నవ్వులకు నై ననుం దగ, దెవ్వనికిని నొప్పి నించుకేనియుఁ జేయన్
      గవ్వల యాటల నైనను, గ్రొవ్వున దబ్బఱలనాడఁ గూడదుసుమ్మీ.

క. కలదానిలోనె చాగము,
      నలువుచు నిచ్చలును బీదసాదల నరయన్
       వలయును దనచేత నయిన,
       కొలఁదిని నొరులకును మేలుగూర్పఁగ వలయున్.

క. ఒరు లొనరించినమేలును,
       గరువంబున మఱవరాదు కలలో నైనన్
       దొరపడి చీటికిమాటికిఁ,
        బొరయం దగ దలుక దానఁ బొదువును జేటుల్.

క. ఒరులేవి తనకుఁజేయఁగ, నరయన్మదిఁ గోరుచుండు నయ్యవియే తా
      నొరులకుఁజేయఁగ వలయును, దిరముగఁదామేలు సెదెందఁదివిరేడునేనిన్

తే. మఱియుమిగిలిననాయంపుఁదెఱగులెల్ల,
       మదికీనాటంగఁదెలిపెనుమనుమనికిని
        భీష్ముఁ డప్పుడచ్చోటికి వేడ్కమీఱఁ,
         దపసిఱేఁడులువచ్చి రాతనిని జూడ.