పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/693

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము


<poem>తరల.పరఁగ నాఁడటు జూదముక్కటి పన్ని యాడి యుధిష్టిరున్

సరగ లోఁగొని యన్నియుం గొనఁజాలి యక్కట యిప్పుడీ
దురవుజూదమునందు నేరుపుతోఁచ కూకర యోడి మ
చ్చరము హెచ్చఁగ మాద్రిపట్టి కొసంగితే శకునీ యొడల్.

సీ.దుస్సల నిమ్మాడ్కి దొసఁగులపా ల్సేసి

                  చనితివే మముఁబాసి  సైంధవుండ
నినునమ్ము దుర్యోధనునకుఁగా నునుఱులు
                  తొఱఁగితే ద్రోణుండ తోడువచ్చి
యొజ్జలంచునునై న నొక్కింతమోమోట
                  మెన్నక కెడసి రే నిన్ను నేఁడు
మఱచెనొకో మేనమా మనుమాటయు
                 శల్యుండనినుఁజంపు జమునిపట్టి

తండ్రిపోయిన బిడ్డలఁ దగఁగఁ బెంచి

చదువుసాములు చెప్పించి సొకినట్టి
నిన్నుఁబడనేయఁజేయాడెనె యకటకట
పాండుని కొమాళ్ళకోయి భీఘ్మండయిట్లు.

వ.మఱియు నప్పొలికలనియందు.

సీ.మడిసినమగల పై ఁబడి సొమ్మసిలి లేచి

                  యార్పులు మినుముట్ట నఱచువారుఁ
బొలిసిన చెలికాండ్రు దిలకించి కస్తిమైఁ
                  బుడమిమీఁదను బడి పొరలువారుఁ
గన్న బిడ్డలమేను గాకులు పొడునంగఁ
                 గనలేక యెద మోఁదు కొనెడువారుఁ
జాఁనకట్టుగఁబడ్డ సై దోడులను గాంచి
               యెడఁద వ్రయ్యలువాఱి నేడ్చువారు