పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/694

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంద్రభారతసంగ్రహము


నగుచువగచెడు మగువల యడలు టులివు
పుడమియును నాకసంబును ముంచుకొనియె
నేమిచెప్పుదు నదిగన్న నెట్టిరాతి
గుండెవానికి వగ పుట్టకుండ దపుడు.

కే.అప్పుడెంతయుగాంధారి యలుకవొడమి
యిట్టికీడులుమూఁడుట కెల్లఁగుదురు
వెన్నుఁడేయని యాతని తెన్నుదిరిగి
యిట్టలతిట్టెఁగడుఁబెద్దయెలుఁగుతోడ.

క.నేఁటికి ముప్పదియాఱవ!యేఁటను నొండొరులనెదిరి యీతీరుననే
యోటరుదురు నీవారలు!గీటడఁగెద వీవు నట్ల కీడ్పడి యొంటిన్.

ఆ.వీనులారవినియువెన్నుఁడాపలుకుల!కించుకయుఁ దలంక కిట్టు లనియె

మునుపె తిట్టిరిట్లు కినుకను జడదారు!లిప్పుడిందుఁగ్రొత్తయేమిగలదు.

క.ఐనను నన్నూరక యిటు!కానక తిట్టుటను నీదు గరితతనం బో
చాన కొఱఁతవడుఁగాకే!మేనియు మేలొదవఁగలదెయిందున నీకు౯.

క.ఆనినంతట ధృతరాఘ్ణం !డనిలోనం జచ్చినట్టి యలఱేండ్లకు నె
ల్లను నగ్గియియ్యజముకొడు!కునుబనిచిననాతఁడపుడెకొదలేకుండన్.

సీ.సొదలను బేర్పించి సొరిదినందఱ కగ్గి
           యిప్పించి యామీఁద నెల్లవారుఁ

దనవెంట బారులై చనుదేర జముపట్టి
           వినువాఁక కడకేగి మునిఁగి యందు
దుర్యోధనుండును దుశ్శాసనుండును
           లోనైనవారికిఁదానుఁదండ్రి
నువ్వులు నీళ్ళను నెవ్వగ నొకచోట
           వదలుచు నుండంగ వచ్చి కుంతి