పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/689

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

పఱియలుగఁ జేయఁజొచ్చినఁ,
గఱివేల్చుత్తరకడుపును గాచెం బెరిమన్.

క. నిసువులు నిద్దురవోవఁగ,
నుసుఱులు గొన్నట్టి కూళ నొడించి తలన్
బసలీను మాసికముఁగొని,
యొసఁగిరి భీముఁడును గ్రీడి యొగి ద్రోవదికిన్.

తే. దానద్రోవదియెంతయుఁ దనివిసనియె
నట్లు తలదార్చు మానికమదియుఁ బోవఁ
బెంపుదఱిఁగి యశ్వత్ధామజంపు మాని
యపుడె కానలపాలయ్యెఁ దపసియగుచు.

వ. అనినవిని యవ్వలి కత నెఱింగింపు మనుటయు.

క. ఎన్నికయిడ రాకుండఁగ
నెన్నియొ జగములను జేసి యెంతొ నెనరుతొ
నన్నింటిని గాపాడుచు
నెన్నండున మఱువులేక యేలెడుదంటా.
మఱిగణవికరము.

తలఁచుట వలననె తగఁ బలుజగముల్
గలుగఁగ నొనరుచు కడింది యొడయఁడా
మెల పునఁ గొలదికి మిగులు జగములన్
నెలవుకొనబయలనిలుపు బలియుఁడా.

గద్య. ఇది శ్రీమదాప స్తంబనూత్ర లోహితసగోత్ర శుద్ధాంధ్రనిరోష్ట్య
నిర్వచన నైషధ కావ్యరచనా చాతురీధురంధర పద్యశోబంధుర
కందుకూరివంశపయఃపారావార రాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా
మాత్యపుత్ర సకల సుజనవిధేయ వీరేశలింగనామధేయ ప్రణీతం
బైన యచ్చతెనుఁగు. భారతమునందు ద్వితీయాశ్వాసము.