పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/690

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయాశ్వాసము

క. తలఁవులచేతను మఱియుం
బలుకులచే నందరానివాఁడ వయి జగ
మ్ముల నెల్లెడ లోవలను
నెవలుపలను న్నిండియుండి వెలిఁగెడువేల్పా.

వ. శౌనకుండు మొదలుగాఁగల తపనుల కాసూతుం డవ్వలికత నిట్లు
చెప్పందొడంగె.

సీ. కొడుకులు చుట్టముల్ పుడమియేలికలును
బ్రెగడలు మొదలుగాఁ బేరుగలుగు
వారెల్లఁగూలిన వగఁగూరి ధృతరాష్టౄఁ
డడలుచు సెజ్జపైఁ బడికరంబు
సొమ్మవోయియు లేచి జొటజొటఁ గన్నీరు
వఱదలుగట్టంగ వనరుచుండ
విదురుఁడు వ్యాసుండు వెనుక సంజయుఁడును
నెంజలి దీఱిచి నెమ్మదిగను
బొలికలనిఁజూడరమ్మని పలుకుటయును
గొంతియును నాలుఁగోడండ్రుఁ గూడిరాఁగ
వచ్చెనంత యుధిష్టిరుఁ డచ్చెరువుగఁ
దమ్ములను దోడుకొని పెదతండ్రిఁ గదిసె.

ఆ. కదిసి తండ్రికెఱఁగి గాంధారికిని మొక్కి
తక్కుగలుగువారిఁదగఁగఁగాంచి
తియ్యమాటలాడి నెయ్యంబుఁ గడుఁజూపి
కఱ్రియన్న వారి కనలు మాంచె.