పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/648

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

<poem>దొరను గేరడమాడి దురమున దడములఁ బీనుఁగు పెంటలుగానొనర్చె మఱియునందఱ సోలించి మఱిచిపోక, తెచ్చెను త్తరబొమ్మపొత్తికలకొఱకుఁ బేరుగలవారి తలచీర లారఁగోసి, తనివిదీఱంగ ననిచెసి వెనుకమరలె.

గీ.అంతఁదెలిసి యుస్సురనుచు దుర్యోధనుఁ,

డపుడెభీఘ్మపలుకులాలకించి
సిగ్గుఁబాటుతొడఁజేరునతోఁగూడి,
యింటికడకు నడచె నిఱుకగలిగి.

క.అప్పుడు కవ్వడి జమ్మిని,

నెప్పటివలె విల్లునమ్ము లిడి యుత్తరునిన్
మెప్పగఁ దేరను నిడి తా,
నొప్పగ నొగలెక్కి చనియె నూరికి నెలమి౯.

క.ఈలోన నట యుష్టిరిఁ,

డాలములో గెలుపుగొన్న యల నిరటునితోఁ
బోలఁగ జూదం బాడుచు,
నాలములోఁబేడిగెలిచె నని వ్రేటుపడెన్.

క.అమ్మఱునాఁ డందఱు నొక,

యిమ్మునఁ దగఁగూడి తొంటి యేపుననుండెన్
నెమ్మిని విరటున కుత్తురుఁ,
డిమ్ముల నెఱిఁగించె వారి నెల్లను వరుస౯.

క.ఎఱిఁగింప యుధిష్టిరునకు,

నెఱఁగి విరాటుండు లేచి యెల్లరఁదప్పల్