పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

<poem>మఱవంగ వేడుకొనియె, దెఱఁగుపడం బలికి కూర్మి తెల్లము గాఁగ౯

తే. చుట్టములనెల్ల రావించి జోటిమిన్న, నుత్తరయనెడి తనకూఁతునొసగి పెండ్లి చేసె నభిమన్యునకు వేడ్క చెన్ను మిఱ, నెంతయును జూచువారలు సంతసిల్ల.

వ. అనిన విని తరువాతి కత నెఱిగింపు మనుటయు

క. కలువల విందును బ్రొద్దును, మలల ంసద్రముల నేళ్ళ మఱి యీపుడమిన్ వెలుగును జీకటి జుక్కల, నెలమినిఁ గలిగించి ప్రోచి యేలెడి సామీ.

మాలిని. జగముల యెకిమీడా సాదులం ప్రోచురేడా పగ యెఱుగని వాఁడా పల్వలం ద్రుంచు ప్రొడా వగ లొదవని వాడా వంతసంద్రపుటోడా నెగు లడ చెడివాడా నేలకు ంసంగడీఁడా.

గద్య. ఇది శ్రీమదావస్తంబసూత్ర లోహితపగోత్ర శుద్దాంద్రనిరోష్ట్య నిర్వచననై షధ కావ్య రచనా చాతురీధురంధర సద్యశోబందుర కందుకూరివంశ పయఃపారావారరాకాకై రపమిత్ర సుబ్రహ్మణ్యా మాత్య పుత్రసకలను జన విదేయ వీరేశలింగ నామదేయ ప్రనీతం బైన యచ్చ తెనుగు భారతమునందు బ్రధమాశ్వాసము. <poem>