పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/647

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

<poem>యతని నరదంబు నడపంగ నానతిచ్చి

యమ్ములను విండ్లు పెట్టిన జమ్మికడకు

క.చని వలసినవామిగై,

కొని తక్కటివాని నందె గుట్టుగనిడి చ
య్యనఁజని గాండీవంబున;
గొనయము నెక్కించి మించి గోరముగాఁగన్.

క.ములుకులు వఱపిన మూఁకలు,

నలుదెపలం బాయవిచ్చి నాననుబఱవన్
బలుమానును లొగిఁ దాఁకిరి,
చిలుకుల వానలు గురియుఁ జేవయెలర్చ౯.

క.తఱిఁదాలుకుండఁగవ్వడి,

యెఱిఁగించుకొనియెను దన్ను నిచ్చట ననికొం
దఱు పలికినఁ దఱికడచుట,
యెఱిగించెను భీఘ్మఁడప్పు డెల్లరువినఁగన్.

వ.అంత నర్జునుండు.

తే.పసుల మరలించి కావలిపరినిద్రుంచి,

వెనుకఁ జనుచున్న ఱేనిని వెంబడించి
కదిసి యోడించి పెఱవారిఁ గండడంచి,
పొలికలన నెత్రుటేఱులువెలువరించి.

సీ.తమ్మునితలద్రుంచి తత్తడులనునొంచి

          బలియునిఁగర్ణునిఁ బరవఁజేసె

ద్రోణుని నొప్పిచి ద్రోణుకొమారునిఁ

          జేయాడకుండంగఁ జిక్కువఱిచెఁ

గృవుని నమ్ములనుంచి కినుకమైభీమ్మని

          యరదంబుపై సోలి యొఱగఁజేసె