క.పౌలోమకాల కేయులఁ
బోలనివాతకవచులను బొలదిండ్లననిన్
వాలమ్ములఁ జంపించెను,
వేలకొలఁది దుండగీల వివ్వచ్చునిచేన్.
వ. ఆలోన నొక్కనాఁడు.
తే. ఊర్వసి యనంగ నచ్చరయోర్తుక్రీడి,
చక్కఁదనమును గనొనిచాలవలచి
కూడ వేఁడుడు వతఁడొప్పుకొనక కసరఁ,
బేడిగానుండఁ దిట్టెనాక్రీడినాపె.
వ. అంతనిచ్చట.
ఉత్యాహ. కడమ పాండుకొమరు లచటుఁ గదలి దైతమనెడికా
ఱడవిఁజేరి కొన్నినాళు లందునుండి సిమ్మట౯
వెడలిగంధమాదనంబు పేరఁ బరఁగుకొండకు౯
నడచియందు నెమ్మినుండి నాతి కృష్ణపంవునన్.
వ. భీముండచని.
క. జక్కులరక్కసులందల,
లొక్కుమ్ముడి డొల్ల్ల నేసియుగ్మలి మదికి
న్మక్కువ గలిగిన పూవుల,
నక్కఱతోఁ దెచ్చియిచ్చె నక్కజమొదవన్.
తరువోజ. పాఱునివేసంబు బాగుగాఁదాల్చి పాండునికొమరులపజ్జనునుండి
వీఱిఁడితనమున వెలయుజటుఁడను పేరిటిపొలదిండి భీముండువేడ్క
మీఱఁగ వేఁటతమినిఁబోయియుండ మెల్లనవందఱ మీఁదవిడుకొని
పాఱినవడముడి పఱతెంచివానిఁ బరిమార్చియందఱి బన్నమువాపె.
సీ. అంతటదివినుండి యర్జునుండరుదెంచి
యన్నకునంతయు విన్నవించి
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/640
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది