పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/641

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

నుకముగానుండంగ నొకనాఁడు ద్రోవది
పూలుగావలెనంచుఁ జాలవేఁడ
మరల భీముఁడుపోయి మణిమంతుఁ గడ తేర్చి
యలరులఁ గొనివచ్చియతివకిచ్చె
నామీఁద నొక్కనాఁడడవిని దిరిగిచు
వడముడి యొక్కచోఁబాముగాఁగ
దారిఁబడియున్న నహుషునినోరఁజిక్కి,
వెడలలేకున్నఁబాండునిపెద్దకొడుకు
పాముకడకేగి యడిగినవానికెల్ల,
బదులుచెప్పుడునది బీమువదలిపెట్టె.

సీ. అట్లుండఁ జూపోపకచట దుర్యోధనుఁ
డేకతంబునఁ గర్ణుఁడెచ్చరింప
మామ యౌనని పలుమాఱును బలుకంగఁ
బనులఁ గాపాడు నెపంబువెట్టి
మొనలడంబముతోడఁ జనుదెంచి పాండుని
కొడుకులుదిగియున్న నెళవునకును
బజ్జగుడారంబు పన్నించి వారిని
వెక్కిరింపఁగ విఱవీఁగుచుండఁ
జిత్రనేనుఁడనెడి జేజేలదిట్టఁడు,
వచ్చితాఁకి కర్ణుఁబాఱఁద్రోలి
దొరనుబట్టి త్రాళ్ళతోఁగట్టికొనిపోవఁ,
జెదరి వెఱచిపఱచి సిగ్గుదోఁప.

వ. అతనిమూఁకలు.

ఉ. సోలియుధిష్ఠిరు న్మఱువుసొచ్చినఁ దమ్ములఁ బంపవారునుం
జాలముసేయకేగి నిముసంబునఁ గూడఁగ ముట్టి తూపుల