నంతనాతఁడు తమ్ముల నతివఁగొనుచు,
నూరివారందఱునుజేరి యొకటఁగుండఁ
జిన్నవోయిన మోముల నన్నెదఱిఁగి,
కట్టబట్టిలతోడనే కానకేగె.
క. కొడుకులగమియు సుభద్రయు
వెడలిరి ద్వారకకు నిచట వీరలతివతో
నడవులఁ గాయలుఁ గసురులుఁ
గుడుచుచుఁ గ్రుమ్మురుచునుండఁ గొంకకయొకదో౯.
ఆ. తెరువు నడ్డగించి తెగువనుబోనీక,
బకుని తమ్ముఁడైన బల్లిదుండు
కినుక మీఱవచ్చి కిమ్మీరుఁడనువాఁడు,
నిక్క వానిభీముఁడుక్కడంచె.
వ. అంత నా పాండునికొమాళ్ళు.
సీ. కడుఁ దపనులు చెప్పుకతలనాలించుచుఁ
గామ్యకంబనియెడి కాననుండఁ
గృఝ్ణఁడేతెంచి యేగినవెస్క వ్యాసుని
పంపునఁగవ్వడి పట్టుతోడ
నొంద్రకీలంబన నెసఁగెడి మలనుండి
యెఱుకురూపునఁ బందినేసినట్టి
ముక్కంటితోఁ బోరి మిక్కిలి మెప్పించి
పాశువతంబనఁ బరఁగునమ్ము
గట్టివిల్తునిచేఁ బొంది క్రాలుచుండ
వేల్పుదొరవచ్చి వివ్వచ్చు వెంటఁ గొనుచుఁ
దనదు వీటికిఁ జనియందుఁ దనివిదీఱఁ
గొడుకుతోఁ గొన్నియేఁడులు కూడియుండి.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/639
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
