పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

పెండ్లినాటికి తొమ్మిదిసంవత్సరములలోపు వయస్సు గలది. గనుక, ఈడేరి కాపుగమునకువచ్చి రెం డుసంవత్సరములుమాత్రమే యయినది. అతనికి ద్వితీయ కళత్రమువలన సంతానమింకను కలుహలేదు. దామోదరయ్య మొదటినుండియు మిక్కిలి బీదవాడు; అతనికి రాజశేఖరుడుగారి చెల్లెని నిచ్చునప్పటికి రాజశేఖరుడుగారి తండ్రియు ధనవంతుడు కాడు. వారిది పూర్వము వసంత వాడ నివాసస్ధలము, రాజసేఖరుడుగారి తండ్రి తనయింటికి గోడలు పెట్టుంచుట కయి పుట్టలు ద్రవ్వించుచుండగా నొకచోట నిత్తడిబిందెతో ధనము దొఱకినది. ధనము దొరికిన తరువాత స్వస్ధలములో నున్న విశేషగౌరవ ముండదని యాచించియో, లోకుల యోర్విలేని తనమునకు జడిసియో రాజశేఖరుడుగారి తండ్రి దారపుత్రోదులతో నిల్లుని వాడ వెంట బెట్టుకొని వచ్చి యప్పటినుండియు ఈ ధవళగిరియందే నివాసముగా నుండి యాచుట్టుపట్టులనే మాన్యములు గొని కొంత కాలమునకు మరణము నొందెను. భాగ్యపోవు వఱకును దామోదరయ్య రాజశేఖరుడుగారి యింటనే యుండి , ఆయనపేరు చెప్పి ధనము యితరులవద్ద తెచ్చి తా నపహరించుచు బయికి దెలియనియ్యక దాచుకొనుచుండెను. తరువాత అప్పులవారు వచ్చి తొందరపెట్టి నపుడు రాజశేఖరుడుగారే సొమ్మిచ్చుకొనుచుండిరి. తోడబుట్టిన పడుచు పోయిన తరువాత దామోదరయ్య చేయు నక్రమములకు సహింపలేక యొకనాడు రాజశేఖరుడుగా రాతనిని కఠినముగా మందలించిరి. అందుమీద గోపము వచ్చి దామోదరయ్య తన్ను బావమఱిది కట్టుబట్టలతో నిల్లు వెడలగొట్టినాడని యూరివారందరి ముందఱ జాటుచు దేశాంతరమునకు లేచిపోయి, యాఱు నెలలకు గడ్దమును తలయును బెంచుకొని మరల వచ్చి, భూత