పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నాల్గవ ప్రకరణము


వైద్యుడనని వేషమువేసుకొని నుదుట పెద్ద కుంకుమబొట్టు పెట్టుకొని వీధులవెంబడి తిరుగుచుండెను. అవరకే దామోదరయ్య తా నార్జించుకొన్న ధనమును వేఱుజాగ్రత్త చెసికొన్నందున అప్పు డాధనముతో నొక యిల్లుగట్టి ఆ గ్రామములోనే ప్రత్యేకముగా నొక చోట గాపురముండెను. అతని భూతవైద్యము నానాటికి బలపడి నందున ఊర నెవ్వరికైన కాలిలో ముల్లుగ్రుచ్చుకొన్న నాతనిచేత విభూతి పెట్టించుచుందురు. ఈ విధముగా దామోదరయ్య భాగ్యవంతుడగుట యేగాక , జనులచేత మిక్కిలి గౌరవసహితము పొందు చుండెను.


రెండవయాతడైన నారాయణమూర్తి మొదట సద్వంశమున బుట్టినవాడేకాని దుర్మార్గులతో సహవాసముచేసి తనకుగల కాసువీసములను వ్యయము జేసికొని బీదవాడయ్యను పయికిధనికుని వలె నటించుచుండెను. అతనికి భాగ్యము పోయినను దాని ననుసరించి యుండిన చిహ్నములుమాత్రము పోనందున , నారాయణమూర్తి తఱచుగా రాజశేఖరుడుగారి యింటికి వచ్చుచు రహస్యమనిచెప్పి రాజశేఖరుడుగారిని లోపలికి బిలిచుకొనిపోయి తన యక్కరను దెలిపి సొమ్ము బదులడుగు చుండును. ఆఋణము మరల తీరునది కాదని దృఢముగా నెఱిగియు, రాజశేఖరుడుగారు మానవతుల గౌరవమును కాపాడుచుంటయందు మిక్కిలి యభిలాష కలవారు గనుకను, అతడు చిన్నతనములో తనసహ పాఠిగనుకను, అడిగిన మొత్తమును రెండవా రెఱుగకుండ చేతిలోబెట్టీ పంపుచుందురు. అతిధానముతో సరిగవస్త్రములు సుగంధద్రవ్యములు మొదలగువానిని గొనుచు మిత్రులకు షడ్రసోపేతముగా విందులు చేయుచుండును. ఇదిగాక యాత డితరస్ధలములలో జేసిన ఋణములకయి ఋణప్రదా