పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
నాల్గవ ప్రకరణము


సంవత్సరములనుండి పనిచేయుచుండె . కాని పని సగముకంటె నెక్కువ కాకపోయిన ను పనివాండ్రును పనిచేయింప దిరుగుచుండెడి యాశ్రితులును మాత్రము కొంతవరకుభాగ్యవంతులయిరి. ఈ ప్రకారముగా దన్ననాదరము చేసి యితరులపాలు చేయుచువచ్చు చున్నందున, ధనదేవత కాతనియం దాగ్రహమువచ్చి లేచిపోటకు బ్రయత్నము చేయుచుండెను గాని చిరపరిచయమును బట్టి యొక్క సారిగా విడువలేక సంకోచించుచుండెను. ఈ సంగతిని దెలిసికొని దారిద్ర్య దేవత యప్పుడప్పుడువచ్చి వెలుపలనుండియే తొంగిచూచు, భాగ్యదేవత యాతనిగృహము చోటుచేసినతోడనే తాను బ్రవేశింపవలెనని చూచుచుండెను. రుక్మిణి వివాహములో నిచ్చిన సంభావన నిమిత్తమై రాజశేఖరుడుగారికి మాన్యములమీద గొంతఋణ మైనందున దానిమీద వడ్డి పెరుగుచుండెనే కాని మఱియొక తొందర యేమియును గలుగుచుండలేదు.


రాజశేఖరుడుగారివలన బాగుపడినవారు పలువురున్నను వారిలోనెల్ల దామోదరయ్యయు, నారయణమూర్తియు ముఖ్యులు. ఆఇద్దరిలో దామోదరయ్య రాజశేఖరుడుగారి బావమఱది; రాజశే ఖరుడుగారి తోడబుట్టిన పడుచునే యాతనికిచ్చిరి. కాని యామె ఒక్కకుమారుని మాత్రము గని కాలము చేసెను, ఆ కుమారున కిప్పుడు పదియేను వత్సరములున్నవి; అతని శంకరయ్య . అతని కెనిమిది సంవత్సరములు దాటకముందే తల్లి పోయినందున , అతడు చిన్నప్పటినుండియు మేనమామగారియింటనే పెరిగినాడు. అతనికే సీతనిచ్చి వివాహముచేయ వలయునని అల్లిదండ్రుల కిద్దరికీని నుండెను, భార్య పోయినతరువాత దామోదరయ్య రాజశేఖరుడుగారి సాయముచెతనే రెండవవివాహము చెసిగొనెనుగాని యాచిన్నది