పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/636

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంభారతసంగ్రహము

క.పాండుఁడు నీతోఁజెప్పఁగ,
     నొడుమది న్నన్నుఁ బుచ్చె నీకడకనుచు౯
     దండిగఁజెప్పి యొడఁబఱిచి,
     యొండుకడకుఁబోయెఁ దపసియొయ్యననింగిన్.

క. అంతయుధిష్ఠిరుఁడప్పుడె,
     మంతనమున, గృఝ్ణతోడ మాటాడివెసం
     జెంతకు నర్జును భీముని,
     నంతసమునఁ బిల్చి యిపుడచని వెన్నునితోన్.

క. ఆలమున జరాసంధునిఁ,
     గూలిచి రండనుచుఁ బనుపగొబ్బునఁ జని యా
     ప్రోలికి వానిన్మార్కొనిఁ,
     యోలింబరిమార్చె భీముఁడొక్కఁడుఁ గడిమిన్.

తే. అట్లుకన జరాసంధునమరఁద్రుంచి,
     యతనికొడుకైన సహ దేవునందు
     నమ్ముఁబూనిచి ముగ్గురు నమ్మివచ్చి,
     గొంతితొలిపట్టికి జెప్పిరంతవట్టు.

క. నలువురుతమ్ములు వడిఁజనీ,
     నలుగడలుంగెల్చి మేలనగలును గుఱ్ఱం
     బులు నేనుంగులు రొక్కము,
     వలువలునుందెచ్చి యొసఁగ వలనుగఱేఁడున్.

ఉ. జన్న మొనర్చి వెన్నునకుఁ జక్కఁగఁ దమ్ముల మిమయ్యఁ బోవఁగాఁ
     గన్నుల నిప్పులొల్కఁ గని కాఱులు ప్రేలుచు నెల్లవారలుం
     బన్నమునొందఁ గృఝ్ణ శిసుపాలుఁడు తిట్టిననల్గియప్పుడే
     వెన్నుఁడు చుట్టుకైదువున వ్రేల్మిడి ద్రుంచెనుఁ వానికుత్తుకన్.