పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/635

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

ఆ. అట్లు కొలువుగట్టి యాజముపట్టికి
నొనఁగనేల వేల్పు లొక్క మెుడిని
దీవెనలనొసంగ దేవేరితోఁగూడి
కొలువుసొచ్చి జమునికొమరుఁడుండ.
ఉ. హత్తులఁగ త్తలానులను నందపురోవిరిఁబోడ్ల జారువా
మెుత్తముదెచ్చియిచ్చి సతమున్మదిమెచ్చుచు ఁ గొల్చుచుండుదుర్
క్రొత్తగ నాల్గుసంద్రములకున్ నడుమంగల రాచదాలుపున్.
వ. అట్లుండ నొక్కనాఁడు.
శా. ఏలా వేఁడివెలుంగు నేలకును నిట్లేతెంచుచున్నాఁడు నేఁ
డోలేఁబాయపు బిడ్డలారకనుఁడం చిక్కక్క చో మానుషుసుల్
గేలుందోయి తమల్చిగుంపులయి యేలింజూడరా నింగియుం
గ్రాలన్నారదు ఁడేగుదెంచె ఁ గడునేడ్కం గవ్వడింజూడఁగన్.
తే. వచ్చి రాచపొడినిగూర్చి పలుకులాడి,
చనఁగ సమకట్టియున్నచో జమునిపట్టి
కొలువునకు ఁ దోడుకొనిపోయి కూర్మిఁ జూవ!
నారివేరంపు ఁ దపసియుననియె నిట్లు:
క. వినుమిట్టిది మున్నెన్నఁడుఁ
; గనుగొనలెదెందు నిజగమ్మున నెపుడున్
వినియు నెఱుఁగ మానుసులం
; దును నుది యపూరూపమనుచుఁ దోఁచెడునాకున్.
అ. అనుచుఁజాల దానియందంబు గినియాడి,
పుడమిఱేండ్ల నెల్లఁ బోరగెల్చి
కూర్చుసోమ్ముననే యొనర్చెడు జన్నంబు,
వడిగనీవు చేయవలయునంచు.