క. పాండుని పెద్దకొమారుని
యండును గఱివేల్పుతోడ నచ్చోటను గూ
ర్చుండినకవ్వడి కిట్లనె
దండముగావించి మయుఁడు తద్దయు నెమ్మిన్.
క. నెనరున నునుఱులు నిలిపిన
కనికరవుంగనికి నొకటి కైకొనిచేయం
గనునేర్తునె యైనను నే
నొనరఁగ నాచేతనై నదొక్కటి నీకున్.
తే. చేయనిచ్చగించినవాఁడఁజెలఁగినన్నుఁ
బనుపుఁడెద్దియైనను నొక్కవనియెునర్ప
నేను రేద్రిమ్మరులలోన నెక్కడైన
నేర్పగలవాఁడనిండ్లపొందికగఁగట్ట.
వ. అనవుడు నంతడు.
క. అపురూపమైనయేలగ
మిపు డొనరింపంగవలయు నీవని వేడ్కం
గవురంపువీడియం బిడి
యపుడంపిన సంతసించి యాతేఁడు వేగన్.
చ. బలుపగడంపు ఁ గంబములు బంగరుదూలములములందమైన చ
ల్వల దొరఱాయరంగులును బచ్చల యచ్చపుఁ దోరనంబులున్
వలుద సుపాణీ సుత్తియపు వెన్నెల సోరణగండ్లు మంచి కెం
వుల నెలకట్టులుం గలిగి పొల్పగునట్టుగఁజేసెఁ గొల్వొగిన్.
క. మఱియుం గేళాకూళులుఁ
దఱుచగు క్రొవ్విరులఁ బండ్లఁదగు పూఁదోఁటల్
వఱచగు డిగ్గియలుం బలు
దెఱఁగులుగల యాటపట్లు తేటగనొప్పన్.
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/634
Appearance
ఈ పుట ఆమోదించబడ్డది