Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

 
మున్నొకయెకీమిఁడు జన్నంబుగావించి
మిగుల నెతిని వెల్వఁ దెగులువొడమి
తన్నుఁగాఱించుట విన్నవించినవిని
తగుమందు ఖాండవమగుట తెలిసి
యగ్గివేల్పురాయనితోఁట వడిగఁజొచ్చి
కాల్పనాతనిఁ బురికొల్పఁగడఁగిచిచ్చు
తోటఁలోఁ జొచ్చి మంటలు తోరముగను.

క. కాలువఁ దొడరినఁ గనలున
     వేలువుదొర యడ్డుసొచ్చి వెనమబ్బులచేఁ
     జాలఁగ వానలు గురిసినఁ
     దూలక యవ్వానిఁ గ్రీడి దొలఁగఁగఁజేసెన్.

క. దానికిఁగాజేజేదొర
     పూనికొని దురంబొనర్ప ములుకులు పెక్కుల్
     మేనన్నాటించి కలఁచి
     జానుచెడంజేసి క్రీడిసరగం బఱపెన్.

చ. మయుఁడనువాని నయ్యెడను మంటలుబిట్టుగఁజుట్టుముట్టునన్
      మెయివడఁకంగ వచ్చినగమీఱఁగఁ గ్రీడి మఱుంగుసొచ్చినన్
      గుయివినిజాలిపుట్టి యెదఁగూరిమి మీఱఁగఁ గాచెనాతనిన్
      మయుఁడును దానికుల్లమును మల్లడినొందెడు సంతసంబునన్.

క. సెలవుంగిని చనియెను న
     వ్వలఁదగ నావేడివేల్పు వడిఁదనియంగా
     నలరుందోఁటను గాలిచి
     యెలమిని దెవుల్లెల ఁబాసి యిచ్చంజనియెన్.
వ. అంత నొక్కనాఁడు