పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రభారతసంగ్రహాము

<poem>పనులెల్లసాగించి పండువు వేర్వెట్టి బలరాము నొకదీవి పజ్జలంపి పెండిగావించి వెలఁదిని మఱఁదిని నడురేయితన తేరువడిగనిచ్చి. యంపవారును దేరెక్కి యరుగుచుండ, నూరి కావలివారెల్ల నొకటఁదాఁకి యార్చి పేర్చినఁగవ్వడి యెర్చి వారిఁ, దెరలఁగా ఁజేసెనుసుభద్రతేరుగడప.

చ. అటువలెఁ గ్రీడి మాఱుకొని యాపఱిఁరూపరఁజేసి చేడియం దటుకున వెంటఁబెట్టుకొని దారిని సాగి యనంబు పర్వఁగా దిటిమున నూరుచేరి తన దిట్టతనంబును నెల్లవారు మి క్కుటముగఁ జెప్పుకోఁగఁ బెనుకూరిమి ఁ దొయ్యలి తోడ నుండఁగన్.

క. కొడుకభిమన్యుండనఁగను, బొడమె సుభద్రకును దండ్రిఁ బోలెడురూపుఁ గడిమియు బ్రోడతనంబును, వడియును బీరంబుగలిగి బలువిలుకాడై.

వ. మఱియు నప్పాండుని కొమ్మళ్ళకేవురకు స్వరుసగా ఁ గొడుకులేవురు. క. ప్రతివింద్యుఁడుశ్రుతసోముఁడు, శ్రుతకీర్తియు ననఁగ మెుదలసొరిదినియందున్ జతక శతానీకుండును, శ్రుతసేనుఁడు బుట్టిరపుడు ద్రోనదియందున్

సీ. కవ్వడియెుకనాఁడు దవ్వలయడవికి వెన్నునితోగూఁడి వేఁటకరిగి నేలవేలుపురూపుఁ దాలిచియచ్చోట వెసమెలంగెడి వేఁడివేల్పు ఁజూచి

<poem>