పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/626

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రభారతసంగ్రహము

<poem> క. బడ లుప్పొంగఁగ రక్కసుఁ

  గడ తేర్చెద నంచుఁ  బలుఁక గా నాపాఱుల్
  కుడువంగఁ బెట్టిరోరెము
  వడముడికిన్మంచి పిండివంటలతోడన్.

చ. అటువలె నారగించి కఱవాఱఁగ సత్త్త్తూవపట్టి లేచి మి

   క్కుటముగఁ దొంటి వంటక మెకూర్చినబండిని నెక్కిరక్కనుం
  డటుకున ఁ జేరి  మాఱుకొని తన్నియుఁగ్రుమ్మియునెట్ట కేలకుం
 బెట పెట  నెమ్ముకల్విఱిచి పీఁచమడంచెను నొక్క వేల్మిడి౯.

సీ. అమ్మాడ్కి బకుఁ జంపి యందఱ నలరించి

                   నెమ్మది నుండంగ నెమ్మి మిఱ
   బసచేసి  యున్నట్టి పాఱునియింటికి
                   జన్నిగ ట్టొక్కఁడు సరగవచ్చి
    ద్రుపదుండు తనకూఁతు ద్రోవదిఁ  గొనఁగోరు   
                  రాచకొమాళ్ళెల్ల రావలెనని
    చాటింప నాలించి జగములోఁ గలరాచ
                   వారెల్ల నచటికీ వరుసగాను  
     బోవుచున్నారు నేనును బోదునటకు,
      నీవి మిక్కిలి బౌఁవల కిత్తురంచు
      విన్ని వాఁడను గావున వేడ్క తోడ,
      ననుచుఁ జెప్పిన నలరారి యవుడకదలి.

చ. బసదిగియున్న పాఱుతను బౌఱుని వీడ్కొని గొంతి బిడ్డలున్ వెస్సఁ జని యొక్కట౯ ద్రువదువీతటికిఁ బోయెడుదారి వ్యాసుతోఁ బొసఁగఁగఁ మాటలాడి వడిఁ బోవుచు వేలువుటేటి చెంతనా నిసితఱిఁ గ్రీడి చేకొఱవి నెయ్యమునం గొనిత్రోవ చూవఁగన్.</ poem>