పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/625

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రధమాశ్వాసము

చ. తలఁచినయప్పుడెల్ల మిముదాకొన వచ్చెదనంచుఁ జెప్పి యా
      బలియుఁడు తల్లి ఁడోడుకొని వారల వీడ్కొని యేనివ్వ్హమై
     వెలువడి యేక చక్రమును పేరిట యూరికిఁ బోయి రన్నయన్
     నలువురుతమ్ములు న్వెరపునం దమతల్లిని గొంచుఁగాల్నడన్.

వ. అట్లుపోయి.

తే. నేలవేల్పుల వేసంబు లోలిఁదాల్చి,
     యొక్క బాఁపనియింటనునుండియూరఁ
      దిరిప మొత్తచుఁ బ్రామిన్కు లరసికఱచు,
      చుండిరేవురు సై దోడులొజ్జలొద్ద.

సీ. ఆకుప్పమున బకుఁడనురక్కసుఁడొకండు
                                  కాఁపురఁబుండి యక్కడనునున్న
      వారి నేప్రొద్దు నిల్వరుసను నొక్కని
                                 బండెఁడు కూటినిఁబసుల రెంటిఁ
     దడవుల నుండి సాపడుచుండు నట్లుండ
                                 నొకనాఁడు పొలదిండికోరెముగను
     బోవలసిన వంతు పొందుగా వారున్న
                                పుడమి వేలుపుపాలఁబడిన నతఁడు

     మిన్నువిఱిగి పడిన చెన్నున నేమియుఁ
     దోఁపకాలుఁదానుఁదోడివారుఁ
     గూడి యొక్క పెట్టె గొంతెత్తి యేడ్వంగఁ
     జొచ్చె గొప్పముప్పు వచ్చెననుచు.

క. అయేడుపు విని గొంతయు
     డాయంగాఁ బోయి యడిగి డగ్గు త్తికతో
     నాయి<టి పాఱుఁ డెఱుఁగం
     జేయుడు పడి భీముఁజీరి చెప్పిన నతఁడున్