పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

ఆ. ఏగుచున్న యప్పు డింతితో నంగార,
పర్ణుఁ డ నెడు వేల్పుపాటకాఁడు
తిరుగులాడు చుండి దిటముగ నర్జునుఁ,
దాఁకీ తూపు లొడలు దవులనేసె.

క. ఏసినఁ గవ్వడి వడివడి,
       నీసు మీయిం జిచ్చఱమ్ము నే డ్తెఱ వై వ౯
       గాసిలి యరదముఁ గోల్పడి,
       యోసరి యంగారపర్ణుఁ డుడిగిన కడిమి౯

తే. కదలివచ్చి యుధిష్ఠిరుకాళ్ళ వ్రాలి
        ధౌమ్యుఁ డనునొజ్జ నొడఁగూర్చి తగవునెఱపి
        చిచ్చిఱమ్మును గ వ్వడిచేతఁ బడసి
        యింతిఁ దోడ్కొని తనయిచ్చ నేగెనంత.

సీ. పాండుని కొమరులు నిండు వేడుకతోడ
ద్రువదువీటనుజేరి యుపము మెయిన్న .
గుమ్మరవానింట నిమ్ముగా దిగియుండి
యెకిమీండ్లు గుమిగొన మీనునీడ
క్రింది నీళులఁజూచి ముందఱ మో పెట్టి
యున్న వింటిని జేత నొనరఁ దాల్చి
నింగి మచ్చెంబు నేయంగ నేర్పు మెఱసి
యె త్త లేరై రి యొక కొంద ఱై త్తియేయఁ
జాలకుండిరి కొందఱు చాలువఱకు
నేసికొట్ట నోపక విడి రాస లెదల.