ఈ పుట ఆమోదించబడ్డది
- శుద్ధాంధ్ర భారత సంగ్రహము
- బేరైన నేల నతనికిఁ,
- దోరం బగుకూర్మి నిచ్చి దుర్యోధనుడున్.
వ. అతనితోడి చెలిమి కలిమి లోనం దన పినతండ్రి కొడుకుల నాతండు గెలువగలం డను గట్టి నమ్మకమ్మున నాతనిం దనయొద్దఁ బెట్టుకొని సంతసించుచుండెనంత.
క. తనవలన జదువుగఱచిన,
- యనినేసెడు రాచవారి నందఱ ద్రోణుం
- డును జేర బిలిచి ద్రుపదునిఁ,
- దనకడకును బట్టి తెండు తడయక యనుడున్.
సీ. అందఱు నరదంబు లాయితంబుగ జేసి
- వెలువడి ద్రుపదుని వీడు చేరి
- కోటలు పడద్రొబ్చి క్రొత్తడంబులుగ్రొచ్చి
- యూరెల్ల దల్లడమొంద జేయ
- ద్రుపదుడు విని వచ్చి దుర్యోధనుడు లోను
- గాగల మగలను గదసి తాకి
- వాలంప గుంపుల వానలు గురియించి
- చిందఱ వందఱ జేసి దండు
క. తన నేర్పు మెఱయ దూపులఁ
- గనలున బరగించి ద్రుపదుగరువంబడ గన్
- జని పట్టి కట్టి తెచ్చును,
- గనువారలు డెందములను గళవళ పడగన్.