పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/619

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము
లమరజెప్పిచె మొదలనాకొమరులకును
బిదపద్రోణుడునాజనుచదువులయ్య.

తే. నేలవేలపు కృవుబావ చాలవతి,

తనకొమారు నశ్వత్ధామగొనుచువచ్చి
వీడునేరిన నా నేలవేల్పు నొద్ద,
వెనుక విలువద్దె గఱపించి మనుమలకును.

సీ. కవ్వడి తనకోర్కి గడువడి దీఱ్చెడ

నని బాసయిచ్చిన నలరి ద్రోణు
డతని కెక్కువ చెప్పియామీదనొకనాడు
రాకొమారుల నేర్పురమణ గనగ
మిన్నేటికొమరుండు మున్నగు వారికి
విన్నవించిన వారు వేడ్కతోడఁ
గొలువుండి చూడంగ వెలయించి రెల్లరుఁ
దమతమ నేర్పు చందమ్మునెల్ల
నందు దుర్యోధనుడు భీముడడరితాఁకి
గుదెలబోరవానికి ద్రోణుకొమరుడుడిసె
నర్జునుండును విన్నాణ మమరఁ జూపి
మారు లేకుండ నొక్కడు మలయుచుండె.

క. అక్కడ కప్పుడు కర్ణు,

డుక్కున జనుదెంచె క్రీడి నొక్కట దాకన్
బెక్కు దెఱంగుల బోరిరి,
యొక్కొకరికి వట్రపడక యోరిమి పేర్మిన్.

క. పోరెడియప్పుడు కర్ణుని,

బీరంబున కెదను మెచ్చి నే యంగము నాఁ