Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/621

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

      ప్రధమాశ్వాసము

 ఆ.అట్లువట్టి తేచ్చి యాతని నొజ్జల,
          కాళ్ళమిఁధ వేయఁ గనికరమున
           నుల్లసంబు లాడి యొడయనిఁ బొమ్మని,
            క్రిడి ద్రొణుఁడు గొనియాడి మెచ్చె.

 చ. ద్రుపదుఁడు దొంటికంటునను ద్రోణుఁడు తన్నటు చిన్నిపుచ్చఁగా
        దపసితనంబు పూని కడుదాలిమి వేల్పులఁగొల్చి ద్రోణున
        చ్చవుబవరంబునం గెడపఁ జూలు కోమారుని దిట్టయెన వే
        లుపుదొరపటియాలయి వెలుంగుకొమారితఁ గాంచెఁ జిచ్చునన్.

క. కని యిట్టు దృష్టద్యుమ్నుం
        డనుచు ఁ గొమారునికిఁ గృష్ణయని కూఁతునకుం
        దనరఁగఁ బేళ్ల్లిడి ప్రోలికిఁ
        జని ద్రుపదుఁడు వింతసంతసంబున నుండె౯.

వ. అంతనిచ్చట.

 తే.విద్దెచేతను గొనముచేఁ బెద్దయైన
      జముని కొమరుని రాచణికమునఁదనకు
      సాయముగఁ జేసికొనితానుసంతసంబు
      నొందుచుండేనుధృతరాష్ట్రఁడుద్ది లేక .

ఉ.అప్పుడు తమ్ములెల్లకడలందును బోరుల గెల్పుఁ గాంచుచుం
      జెప్పెడి దేమి పేరుగల చిక్కనిరేఁడుల నోర్చి వారిచేఁ
      గప్పము లెంతయుంబలిమిఁ గైకొని యన్నకుఁ దెచ్చియిచ్చుచున్
      గొప్పతనంబు వాసియిను గూర్పఁగ నోరువలేక యీసున.

సీ.మంతనంబున మేనమామను శకునిని
                            దుస్సనేనునిఁగరుఁదోడితెచ్చి
    దుర్యొధనుఁడు వానితోడను దలపోసి
                      యాకరపులఁబట్టి యయ్యకడకుఁ