పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/596

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

590 రసికజనమనోరంజనము

వ.అట్లు కదిసియచ్చట నెచ్చెలిమికానితో ముచ్చటలాడుచుండ. 65

చ.పలుకులలాగూ నెమ్మొగము బాగును మిసము నూగు నొక్కటై
     యలరుటకోరై తబ్రపడి యప్పటి పాఱునిఁగా నెఱింగి నె
     చ్చెలిగమిఁజీరి చెప్పె మనచెగటమున్ బువుదోఁట నేరిమిం
     బలికినయల్ల బూటకవు మాటలమూట యితండెయంచటన్. 66

క.తనగుట్టు బయలఁబెట్టక! పనిచేయఁగ నొడయఁడంత వడిహలవాఁడే
     ననబోఁడి గుట్టరయ నీ!యన సింగారించి పంచెనని నగిరిచెలుల్. 67

ఉ.ఆయెడ నింతియెర్తు మదినాఁగక కోర్కులు క్రేళ్ళు దాఁటనే
     మెయనఁబోవు నెచ్చెలిని మెవిపయిం జిఱు నవ్వు మొల్క లే
     పై యిగురొత్త గనయిగ నల్లనమానిచి జాఱుపైఁటఁజం
    దోయికి ఁదార్చుచుంబలికెఁ దొంగలి ఱెప్పల నొప్పులీనఁగన్. 68

గీ.మేలుగూర్చినవారికి మేలెకలుగుఁ
గావూనను మనమిజన్నిగట్టు నిపుడు
తోడఁబెండ్లి కొడుకు ఁజేయఁదొడరవలయ
మనువుకూర్చినపనికి ఁగామగువలార. 69

గీ.అనిన ముసిముసినగవుల నల్లఁబూని
యొండొరుల మెములనుజూచి యొక్క రొకరు
కన్నుసై గల నేనేమొ యెన్ను కొనిరి
క్రీడియునుగూర్మి సంగడి కాఁడునంత. 70

గీ.తేటరతనంపుముక్క లిపీట తెచ్చి
వింతకపురంపుఁ బొడులతోఁ బెట్టినట్టి
ముగ్గులోపల వేయంగబుడమి ఱేఁడు !
వచ్చి కూర్చుండెన ద్దానిపై నినపుడు

సీ. కురులు చిక్కూలుతీసి క్రొత్తసంపెఁగనూనెఁ
దలయంటెఁజిలుకలకొలికియెర్తు
వచ్చకప్రము చాయ పసవునమేదించి
నలుగిడెనెమ్మేను నాతి యేర్తు