పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/595

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

<poem> చతుర్దాశ్వాసము

వ. అంతంసంతసంబునఁ జిత్రవాహనుండు తగుపోడిమి గీడినివీడుకొని తన యింటికింవచ్చి పెద్దలంజెచ్చెర రావించి పెండ్లికి దగిన మంచిమూ రుతంబు పెట్టుడని కట్టడయిడి యూరుగై నేయఁ జాటంబంచిన.

సీ. కస్తురి పన్నీట గలయం పి చల్లించి గోడలుజవ్వాజి తోడనలికి ముగ్గులు కట్టాణి ముత్తియంబులఁబెట్టి నెల ఱాలతోడఁదిన్నియలు వైచి డంబైన పగడంపుఁ గంబముల్నాటించి తెల్లక్రొవ్విరులఁ బందిల్లు వేసి తోరంపుఁబచ్చలఁ దోరణంబులుగట్టి రతనంపుదివ్వెలు జతను పఱిచి కలయ బంగరు పని మేలుకట్లుకట్టి వాడవాడల హొంబట్టు పడగలెత్తితావులమెరున్ <poem>