పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంచిగందపు దావి మించి గుబుల్కొన నటకలితలనిడె నతివ యెర్తు
బంగారు బిందెలఁ బన్నీరు గొనివచ్చి
జలకంబులాడించెఁజెలువయెర్తు

నీరుముమ్మాఱు తలచుట్టు నెఱయఁద్రిప్పి
తడవుమనుమని దీవించెఁబడఁతి యెర్తు
రతనములపీట దొరదిగి రాఁగానెదుట
నిలిపె బంగరు పావలు నెలఁతయెర్తు. 72

సీ.జిలుఁగు జెంద్రిక వన్నె చేల చెఱుంగువఁ
బెన్నెరుల్త డియొతైఁగన్నేయొకతె
గమగమవలపులు కడలుముంచుకోనంగఁ
జూసరుల్ సిహఁజుట్టె బోటియొకతె
పెళపెళలాడు దువ్వలువపింజెలుపెట్టి
వెసఁజేతికందిచ్చె వెలఁదియొకతె
రతనాలపనిమేలి రవణంపుగుంపులు
నెమ్మేనఁగీలించెఁగొమ్మయొకతె
పొలఁతియొక్కతె జవ్వాజిపూ సెమేనఁ
జెలువయొక్కతె పన్నీరుచిని కెఁబయిని
పూసురటివీచెఁ దలిరాకుబోఁడియొకతె
నిలువుటద్ద మొక నెలంత నిలిపెమెల. 73

గీ.ముద్దుకస్తూరినామంబు దిద్దెనొపటఁ
బెండ్ల పల్లకిలో నెక్కి విడిదివెడలి
యరిగె వియ్యపు వారింటి కచటమున్నె
మించిబోండ్లు చిత్రాంగదఁగొంచు ఁబోయి. 74