పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/585

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

</poem> చ. అలరెడు రేవెలంది చెలువారఁగఁదాల్చిన కావిరంగుదు

   వ్వలువవదల్చి చందురని వావిరిఁబొందఁగగోరి మల్లెమొ
   గ్లలుగల నీలిచీర మెయిఁగట్టెననంగనుజుడనొప్పెఁజు
   క్క్స్లగమితోడఁజీఁకటులు కన్నులపండువుగాఁగ నయ్యెడన్.

ఉ. గొందులుదూఱుచుంవెడలి గోడలుదూఁకుచుఁ బొంచిపొంచి

   సందడిగాకయుండఁ జిఱుసందుల వెంబడిఁ దావుఁకజేరుచున్
  సందియమంద కాఱడికి సై ఁ చుచు సాముల మోసపుచ్చుచుం
  జెందిరి కోరుకోరికలఁ జేరిబొజుంగులు దొంగలుందగన్.

గీ. తమ్ములకు దాయయౌఱేఁడుతాజగమ్ము

  నందుఁజొచ్చియుంటకుఁగాను ముందుపంపి
  నట్టి తెలిగుడారమనంగ నమరెఁదూర్పు
  దెసను దెలిపన్నె కలువలు తెల్వినొంద.

ఉ. చుక్కలఱేఁడు చీఁకటులసూడు వెలుంగులఱేని జోడు బల్

  జక్కనవుల్గు మొత్తముల సారెకునేచెడువాఁడుచక్కనౌ
  మిక్కిలి కంటిదేవరకు మేల్నగయై తగువాఁడు కల్వలన్
  మక్కువఁబ్రోచుఱేఁడు మరుమామ కనంబడెఁ దూర్పుకొండపైన్.

చ. తఱియనువేఁటకాఁడిరులదండను కోయిలగుంపుఁబట్టఁగాఁ

  బఱిచి వలన్ని గిడ్చెననఁ బర్వెను దూర్పునఁదెల్పు, లోఁజిగు
  ళ్ళెఱకయి పెట్టినట్టు నెలయింపగు, బడ్డ పులుంగనంగళం
  కొఱపగుఁ, గాంచి పర్విడెడు నోప్పనఁ గోయల లేగుజీకటుల్

చ. కొమరు వెలుంగు రేవెలది కొప్పనజీకటి, కొప్పుపూలునా

   నమరును ఱిక్కచాల్, నెలమొయూరపు రాగిడిబిళ్ళయట్లగున్,
   సమకొనుకందు లోనిడిన నల్లనిఱాయన నొప్పు, రాగిడిన్
   జమలిగఁ జుట్టుమల్లెలనుఁ జందురుచుట్టును దెల్పుగన్పడెన్.</poem>