పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

గీ. తమినిరేవెలంది యిడుగందమంబుమేనఁ
      దాఁజలువల ఱేఁడప్పుడు తాల్చెననఁగఁ
       దెల్ల నయ్యెను జందురుండల్లనల్ల
       నెల్లకడలను వెన్నెల లల్లుకొనియె.

సీ. నెఱతావులుచెలంగ నిండారవిరిసిన
మల్లెపూవులుతోడ వెల్లివిరిసి
కప్పురవుటనంటి విప్పుఁబొరలరాలు
కప్రంపుఁబొడితోడఁ గలసిమెలసి
కమ్మవిల్తునిదాయ కాపురంబైతగు
వెలిమలజిగితోడ వియ్యమంది
కఱివేల్పునిల్లాలిఁ గనిపెంపుగాంచిన
పాలమున్నీటితో మేలమాడి
మెండికొనియుండె బువునిండ వెండికొండ
కొండపిండులఁ జెండెడు దండిహత్తి
పిండికలకండ వెలిఁదమ్మి దండఁదెగడి
పండు రేయెండదండులు నిండుజిగిని.

వ.అత్తిఱి నాబిత్తరి చెలికత్తెలతోడ నత్తోఁటలోనుండి నిండికొన్న పండు
     వెన్నెల తెగల సెగలకుం దాళంజాలక.

ఉ. చెందొవవిందు దందడినిఁ జిందఱవందఱ చెందికుందఁగాఁ
      జిందురువిందఁ, గొందలముచెందఁగ డెందము కందుఁడందపుం
      గెందలిరుం దగందొడుగఁ, గ్రిందుపడందగు పొందికందొగల్
      సందడిచిందఁ దుందుడుకు చందముఁబొంది వెలందివందురున్.

ఉ. నెయ్యపుటొజ్జ లోఁగఱపి నిచ్చలునూల్కొలుపంగ నోరె మొ
య్యొయ్యన సన్నగించి మదినొంటుగనల్ల జగంబుచుట్టమున్