పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/584

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రసికజన మనోరంజనము

చతుర్థాశ్వాసము

 క. సిరివడఁతి యెడ@ందనెప్పుడుఁ
     గరమలరఁగ గొల్చువారిఁ గడుఁగూరిమితో
     నరయుచు నెల్ల జగమ్ముల
     వెరవారఁగ బ్రోచుచుండు వేల్పుల వేల్పా.

వ. వైశంపాయనుం డటమీఁద నడచినకత జనమేజయున కిట్లని చెప్పం
     దొడంగె నట్లాబూటకంపు నేలవేలుపు సూటిగామాటలాడియా
     చేడియన్వీడ్కొని క్రీడికడకు న్వేడుకమెయిం జనిన వెనుక నమ్మచ్చె
     కంటి తమకంబు హెచ్చిపెచ్చు పెరిగెడి మరుచిచ్చున వ్రేఁగంజొచ్చిన
     నెచ్చెలులెల్ల బెల్లుగఁదల్లడిల్లి యుల్లంబులోని యారటంబు దీఱ
     నూఱడింపుచుండ.

క. పడమటిమల కలుగులలో
     నడఁగిన యిరులను గడంక నవలికిఁదఱుమన్
     వెడలెడి వడుపున నడిచెన్
    బడమటికొండకును బ్రొద్దువడిఁగెంపడన్.

చ. అదనదితప్పి వేఁడివెలుఁగత్తమిలన్ దడమెత్తుపాముగా
      ముదొరవిసంపుమంటలనఁ బొల్పగుఁ బడ్మరసంజకావి,పైఁ
     గుదిరిన సందెచీఁకటులు, చుక్కలొహిందలమానికంబులలౌ.

గీ. గొండ్లిసలిపెడి యురవడి గుబ్బలల్లు
     జడలగుంపులువీడి యీపుడమినెల్ల
     నలముకొనియె ననంగ నలుపుమిగిలి
     కటికిచీఁకటి యెల్లెడఁ గ్రమ్ముకొనియె.