Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/547

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

ఉ. మున్నులమింటిమీను నొకముల్కినిగూలిచి క్రీడి ద్రోవది౯
     గొన్న తెఱంగు జవ్వనులకుం గడువాసలు గొల్పురూపునుం
     గన్నదివేయినోళ్ళ ముదుకల్గొనియాడఁగ నాలకించి యీ
     యన్నులమిన్న పొంగి యెదయాతనిపై నెలకొల్పి వెవ్వగ౯.

క. కుందుచు నెవ్వరితోఁదన
     డెందంబునకోర్కివెల్ల్లడింపక లోలో
     వందురి యంతంతకుమెయి
     యందముచెడ సన్నగిల్లి యలసగమైన౯.

ఉ. తత్తఱమొందిదీనికిఁ గతంబెఱిఁగింపఁగదమ్మయంచు
     మిత్తఱి వేయిచందముల నీమెనువేఁడిన నెట్టకేలకున్
     బిత్తరి యంతియుదెలిసి బేలతనంబునఁ బల్కులాడి తా
     నుత్తలపాటుతోడ మిము నొక్కటఁ బేర్కొని మీరలుండిన౯.

క. తనకియ్యెడఁ గడుఁదోడయి
     పనిపూనికడిందికోర్కి పండింత్రుగదా
     యని వేచియున్నదిదే మ
     న్ననమీచెలి నప్పగించినారముమీకున్.

ఉ. మా బరువంతయుం దొలఁగె మాచెలియనన్మిముఁ గూర్చినార మిం
     కీబలితంవుఁ గర్జమెటు లీరలుదీర్చెదరోసుఁడీ యన౯
     జాబిలి చల్వచూపులను జామనుగగ్నొని మంజువాణి గా
     రాబముమీఱనిట్ల నె@ంగరమ్మును దేనియలొల్కుపల్కులన్.

సీ. మేమిద్ద్దఱముమున్ను మీయొద్ద సెలవొంది
                                   నలువజగమ్మున కలరువేడ్క
     మింటను జనుచుండి మిట్టలుపల్ల ముల్
                                  చదునునేలలయట్ల మదికిఁదోఁపఁ.