గుప్పముల్ పల్లెలుఁ గుప్పవోపినయట్లు
కనువిందుగాఁగను గానఁబడఁగఁ
జెఱువులుమడువులుఁ జిన్న యద్దపుబిళ్ళ
లట్లుచూడ్కికిఁ జాలనందగింప
వేడ్కపడుచును నెడనెడ వింతలెల్ల
నొండొరులతోడఁ జెప్పుకొంచొక్కచోట
నూరిపఱగడ సింగార మొలుకుచున్న
పూవుఁదోటలో నోక్క క్రొమ్మావిక్రింద.
సి. బవరిగడ్డమువాని బవడంబుఁ గ్రొత్త చెం
దొవడంబుఁదెగడు కేల్దోయివాని
తలిరిఁబాయమువాని వలఱేనినిండుక
ల్వలఱేని నగియెడు చెలువువాని
తళుకుఁజెక్కులవాని తేఁతులమీలమొ
త్తమ్ములనగు కన్నుదంటవాని
తేనెమాటలవాని తేఁటులఁగప్పుఱా
తేటలనగుసిగతీరువాని
చెలులతోడను ముచ్చటల్పలుపువాని
కవ్వడినిజూచి యాసోయగంబునకును
నెచ్చెరువునొందుచును గ్రిందికల్లడిగ్లి
కంటిమాతనిఁ గన్నులకఱవుతీఱ.
సీ. దొరవేనిదొరమోవి దొండపండెన్న నే
చెలుకలకొల్కిలోఁ దలఁపకుండు
పుడమియేలికమేలి బుజము తూడులఁజెప్ప
వేయంచయాన కన్నిడకయుండు
పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/548
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
