పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/546

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరజనము

క. ఎక్కడినే నెక్కడి ఱేఁ
     డక్కున ననుగారవించు నతఁడనుకొనియుం
     టెక్కడ యీవలపుఁగడలి
     నెక్కటి నేనీఁదుటేడ యీవేసటతోన్.

ఉ. ఎవ్వరిఁబంపుదానఁ జనియిప్పుడు చెల్వునితోడ నావెతల్
     నెవ్వడివిన్నవించి తననేరుపుచూసి మదింగరంచఁగా
     నివ్వలవంత నెక్కణి నీఁగుదుతక్కట చిల్కలైనమం
     దవ్వులకేగ కియ్యెడను దానుననుండిన నన్నుఁగాచుఁగా.

క. అనుచుండఁ దలఁవులోననె
     చనుదెంచెను జిలుకకవయుఁ జదలుననటకులన్
     విని ఱెక్కచప్పుడొక్కట
     ననుఁగుం జెలులెల్ల ఱెప్పలార్పకచూడ౯.

గీ. చేరవచ్చి చిత్రాంగద చేతిమీఁద
     వాలి ముద్దిడి సేమంబువరుసనడిగి
     పలుకు వెలఁదుక తమ్మియ్యఁబంచినట్టి
     యీగిర్మాఁకుల క్రొవ్విరులెలమినిచ్చి.

చ. నలువ జగంబునందలి వినందగువింతలు కొన్ని తెల్పి యా
     వలఁ దమ కూర్మినెచ్మెలిని బాఱఁగనుంగొని యామెమేను మి
     క్కిలి వసివాడియుండుటయుఁ గీడ్వడిమోమునఁ దొంటితెల్వియి
     మ్ములఁ దిలకింపరామియును ముంగ్నల సంతసపాటులేమియున్.

క. కనిపట్టి డెందమందున
     వనటం దిగులొంది తోడివారలనెలమిన్
     వనబోఁడి యట్లు చిక్కుట
     కును గతమడుగంగ వారు కూరిమిమీఱన్