పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/542

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

గీ. నిదుర లేకుంటఁ జెమ్మట నిండుటయును వెసను వేల్పుఁదనమును మానిసితనంబు నెపుడు నెమ్మేనఁ గాంనింప నెల్లతఱిని గాంచె నరంవెూడ్పూ క్రాల్గంటి కన్ను దోయి.

సీ. పువ్వులుముడువదు పూబోఁడి యయ్యవి తొవవిందునల్లుని తూవులనియెు యద్దంబుఁజూడదుముద్దియ దానఁగ నడువెూము మున్నీటిపాపయనియెు కురులుచేముట్టదు విరిబోఁడియయ్యవి క్రొవ్వారుతుమ్మెదగుంపులనియుె చెలులపల్కులు వినదెలనాగయవియెల్లఁ జిల్కమెుత్తంబుల పల్కులనియుె యతంకంతకు వలవంతదోఁప మరుఁడు పూముల్కులడరించి కరమునేఁ ప నెడఁదఁ గవ్వడిపయిఁగోర్కి యెపు చూప సన్నగాలియు నెమ్మేని చెన్నుచూప

చ. చెలులను మాతికింగదుముఁ జిల్కలఁ బల్మఱు వీసడించు నం చలఁదఱుము౯ నెమళ్ళనొగిసారెకుఁ బాఱఁగఁదోలు గండుఁగో యిలపలుకుల్ వినందులకు నేఁచికలంచును గోరువంకల౯ గలికి మదింగడింది వెతగల్గిన రోఁతలుగావె యన్ని యున్.

గీ. బోటినెమ్మేను బంగారమాటనపుడు కమ్మవిల్కానిచిచ్చునఁ గరఁగుచున్న దోయనంగ వైుఁజెమ్మట యుెప్పుమిఱి వెల్లువగుచును బాఱెను బెల్లుదనరి.