పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/543

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ద్వితీయాశ్వాసము

సీ. ఆవెల్లత త్తడి యతఁడొడ ల్సేర్పక
                    వెలనువెండ్రుకయట్లఁ జులక నగునె
యల్లమానిసీసింగ మక్కు నఁజెర్పక
                    యించువిల్తుని బెదరింపనగునె
యాపజదొరక్క నౌమెముదార్పక
                   కొదమరాయంచలో ఁ గొనఁగనగునె
యల్లజగముచుట్ట మలరించియేలక
                   తుమ్మెదదిమ్ముపెఁగ్రమ్మనగునె

యనుచు నయ్యింతి సగమను నంతకంత
కొగినిలిచినచోట నిలువకుండుఁ బెల్ల
దనముపూను వెన్నెలకును దలముడుందుఁ
దలిరువిల్కాని కాఁకకుఁ దాళలేక.

గీ. చీగురుబోఁడికిఁ గోయిలల్ పగవియయ్యెఁ
గొమ్మ కెంతయు ఁ దెమ్మెరకూళయయ్యె
నలరుఁబోడికిఁ గిట్టనినయ్యెఁదేంట్లుఁ
దమ్మికంటికి రేఱేఁడు దాయయాయ్యే.

చ. మరునకుఁ దూపునేనరయ మామవునీవును గాననట్టిచో
     నిరువుకిట్టిపట్టిపగయేటికిఁ బాటయె యంచుఁదెల్పిచం
     దురుమది దేర్ప నాతని నెదుర్కొనఁ దామరచేరెనోయన౯
     దరియెఁగఁజేర్చె ఁ జామ చెయిదామరచెక్కున వెచ్చనూర్చుచున్.

ఉ. కన్నులకాటుకంగలిసి కల్కిచనుంగవమీఁద జిందు వా
      ల్గన్నుల నీటితుంపరల గారవమెన్నుఁగనయ్యె నయ్యెడన్
      జెన్నెసలారుతామరల చెల్వపుఁదేనియలాని యంతటన్
      గ్రొన్ననగుత్తులంగదియు కోరికనేగెడు తేఁటులోయనన్.