పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/517

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రధమాశ్వాసము

చల్లఁదనంబును బెల్లీవిగల్గుట
                              జాబిల్లి కొలమౌట సాటుచుండఁ
           జక్కఁదనంబును మిక్కిలి పరువంబు
                              వేఁగంటికొడుకౌలు వెల్లడింప
           నక్కటికంబును ననదలఁగాచుట
                               వెన్నుని చెలియౌట విన్నవింప
           నసమునువడిగల్లి యలరుటమిన్నేటి
                               ముమ్మనుమండౌట పూని తెలుప
          నన్నమాటయన్న నడుగుదాఁటక పిన్న
          పెద్దయంతరువుల పెంపుదెలియు
          మేటి క్రీడికెవరు సాటి ముజ్జగముల
         నతనికతఁడె సాటియగునుగాక.

         ఆతనిసోయగంబు చెవులార వినంగనునట్టి ముద్దియల్
         చేఁతలఁదొట్రుపాటెనయఁ జెల్వునినాతనిగాఁగ నెమ్మదిన్
         బ్రాఁతిగ నెంచి కూడుదురు బాపురె నిచ్చలుచూచిరేని యా
         నాతుల చేఁతలంగలుగు నానలుకందుఁడు కొల్లవెట్టఁడే.
         
         ఆతండొక్కఁడు ప్రొద్దువోక యొకనాఁడందందుఁ బూఁదోఁటలోఁ
        జేతుల్ చేతులు సేర్చికొదఱుచెలుల్ సేమంబునన్వెంటరా
       లాఁతుల్బారులుగట్టి చెంగలువ కేళాకూళి లోద్రోవలన్
       వాతోడై చనుదేరఁ గ్రుమ్మరితగన్ జాబిల్లిఱాతిన్నెపై.
    
       కలయంగఁబన్నిరు చిలికినకురువేళ్ళ
                              వీవనయొక్కండు వీచుచుండఁ
      బచ్చకవ్రపుఁదాని మెచ్చుగుబుల్కొను
                           పండాకుమడువు లొక్కండొసంగ