పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/518

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
రసికజనమనోరంజనము

ముత్యాలకుచ్చులఁ బొదలుచిత్తరువ్రాఁత
                                  కెంబట్టుగొడుగొక్కఁ డెమ్మెఁబట్ట
    జిలుగుజరీచెట్లు తలగడతొడ క్రిందఁ
                            బదిలంబుగనొకండు కుదురుపఱకు
    
   వలపుగొలిపెడు చిఱుగాడ్పు లొలయుచుండఁ
   గెలనికొలఁకుల తేఁటులు వలుకుచుండఁ
   జెలులతో ముచ్చటల్ సల్పు చెలమితోడఁ
   జెన్నుమీఱంగఁ గూర్చుండి యున్న యెడను.

సీ. వేల్పురాయఁడు తన బిడ్డయొద్దికిఁబంపు
                               పొలుపొందు పచ్చలబొమ్మలనఁగఁ
     బ్రోలిటెక్కెపుఁ జేలగాలిని నేలపై
                               గూలు జేజేచెట్లకొమ్మలనఁగఁ
బ్రొద్దుమావులు మేయఁబోజాఱి వుడమి పైఁ
                                   బడు పచ్చిగడ్డిజొంపంబులనఁగఁ
బువుఁదోఁటగవ్వడిఁ బొడఁగాంచి మరుఁడంచు
                                   జేరుపూవిల్తు తేజీలనంగఁ

      జిలుకలొక రెండు ముద్దులు చిలుకుచుండ
      దిన్నె పై నున్న యెకిమీని కన్ను దోయి
      విందు చెందంగ ముందఱ నందమొందు
      పొన్న గున్నకు మిన్ను నఁదిన్నడిగియె.

క. ఆకై వడిడిగి కొడొక
     మ్రాఁకునుఁ గూర్చుండిలేచి మగుడని మదితో
    నాకవ్వడికన సొగనుల
    ప్రోకలనం జిల్కలల్లఁ బుడమికి డిగుచున్.