పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
రాజశేఖర చరిత్రము

నగాఁ దామును దక్షిణపు గోడ కానుకొని యెండలో నుండి నడిచి వచ్చిన బడలిక చే బట్టిన చెమ్మట పోవ నుత్తరీయముతో విసరు కొనుచు గూరుచుండిరి. అప్పుడు నభిరాఘవాచార్యుడు నామముల తిరుమణి బెత్తికలు లేవ నెడమచేతులు నలుపు కొనుచు రాజశేఖరుడుగారి మొగము మిద జూడ్కి నిగిడించి,'దేవరనారి కీనడుమ స్వామి మిద్ కొంచె మనుగ్రహము తక్కువగా నున్నది.'అని యొకచిఱునవ్వు నవ్వి లేచి నిలువబడి బట్టలో నున్న గన్నేరుపూలలో మాలెను దీసి చేతిలో బట్టుకొని 'స్వామివారి యందు బరిపూర్ణకటాక్ష ముంచవలెను'అని వినయముతోప బలుకుచు మెల్లగా హస్తమునం దుంచెను.

రాజశేఖరుడుగారుభక్తితోబుచ్చుకొని,'యీమధ్య మనజనార్దనస్వామివారికి జరగవలసిన యుత్సనము లేమయిన నున్నవా' అని యడిగిరి.

రాఘ: పదియేనుదినములలోమార్గశిరశుద్ధచతుర్దశినాడును, పూర్ణిమనాడును వరుసగా తిరుమంగయాళ్వారి యొక్కయు,తిరుప్పాణాళ్వారియొక్క యుతిరునక్షత్రిములు వచ్చుచున్నవి.నెల దినములలో ధనుర్మాసము వచ్చుచున్నది. ఆ నెలదినములును స్వామికి నిత్యోత్సవములు సంక్రాంతి దినములలో నధ్యయనోత్సవమును జరగవలసి యున్నవి.ధనస్సులోనే పుష్యబహుళ ద్వాదశినాడు తొందరడిప్పొడియాళ్వారి తిరునక్షత్రము వచ్చుచున్నది.ఆ దినమున స్వామి యుత్సవముకన్నను విశేషముగా జరగవలెను.


రాజ-నిత్యమును స్వామికిబాలభోగమును నందాదీపమును క్రమముగా జరుగుచున్నవా?