పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మూడవప్రకరణములు


ఆవల నిత్తెమల్లిచెట్టును వాని చేరువనున్న నందివర్ధనపుచెట్టుమీఁదనల్లుకొన్న కాశీరత్నములను రాజశేఖరుఁడు గారికి నిత్యమునుదేవతార్చన కయి పుష్పపత్రాదులను సమకూర్చుచుండును. ఆపైని రుక్మిణియుఁ జెల్లులునుప్రేమతోఁ బెంచుకొనుచున్నబంతిచెట్లను, బొగడబంతిచెట్లను, జంత్రకాంతపుచెట్లను గోడపొడుగుననువరుసగానుండును. పడమటింటినంటియేదక్షిణవైపుననున్న వంటయింటి దొడ్దిలోపల నరఁటిబోదెలుపిలకలతో నిండియుండి చూపుపండువుగానుండును. రాజశేఖరుఁడుగారు ప్రత్యహమునూ అబోదెమొదలనెస్నానము చేయుదురు.

వెనుక చెప్పినచొప్పున రుక్మిణి స్నానముచేసివచ్చి గోదావరినుండి చెంబుతోఁదెచ్చిన నీళ్ళను తులసికోటలోఁబోసిమ్రొక్కి, తడిబట్టలతోనే చుట్టునుమూడు ప్రదక్షిణములుచేసి, లోపలికిఁబోయితడిబట్టవదలి పట్టుబడ్డకట్టుకొని యొక చేతిలోఁగుంకుమబరిణియు రెండవచేతిలో నక్షతలను బసపును బియ్యపు పిండియును గల గదులు పట్టెయునుబట్టుకొనివచ్చి, తులసికోటలో నంటియున్న ముందరివేదికమీఁద నీళ్ళుచల్లి చేతితో శుభ్రముచేసి బియ్యపుపిండితోపద్మములు మొదలయిన వింతవింతల మ్రుగ్గులను బెట్టుచు నడుమ నడుమఁజిత్రముగాఁ గుంకుమతోను పసపుతోను నలంకరించుచుఁగూర్చుండి, మధురస్వరముతోమెల్లగా, 'లంకాయోగము ' పాడుకొనుచుండును.

ఈలోపుగా రాజశేఖరుఁడుగారు వెంటనున్నవారితో నానావిషయములను ముచ్చటించుచునడుమనడును వారి కిఱ్ఱుచెప్పులజోళ్ళచప్పుడులలో నడఁగిపోయిన మాటలనుమరల నడుగుచుఁబలువురతోఁగలసి యింటికి వచ్చి, పాదరక్షలను నడవలోవిడిచి యొకరొకరేవచ్చి కచేరిచావడిలో రత్నకంబళముల మీఁదఁగూర్చుం