పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/476

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన నైషధము

ఉ. అందొకజన్ని గట్టరిగి యల్లననాతుక యున్నయూరికిం

గొందఱతోడ గూడిచని కొల్లగ నీగియొసంగురాచయిల్
సందడిలోన జొచ్చి యొక చకినిగాంచె సునందలోనుగా
నందులోనున్న రాచయెలనాగలలోన నొయారినచ్చటన్ .

గీ. నీఱుగదిసియున్న నెఱచిచ్చునచ్చున
గూటనున్న చిలిక జోటిసాటి
జెన్నుదఱిగియున్న యన్ను గనుంగొని
తొలుతగలతెఱంగు తెలియలేక.

చ. నుదటనుగాననయ్యును గనుంగునగూడని నల్లచుక్క యొం
డెదుటను జూచిసంతసిలి యింతిని నన్నలుక్రాలుగంటిగా
నెదను నెఱింగి యీకరణి నింకినయేటి తెఱంగునం గడుం
జెదరినచెన్నునందనరె జేడె నలుండెడయైననంచులోన్

క. కడునడలుచు జేరంజని
జడిగొని కన్గొనలనీరు జాఱగదల్లీ
కడకన్నిన్నరయగ ని
య్యెడనేనరుదెంచినాడ నెక్కటినిటకున్.

క. నీతల్లియుసైదోడులు
నీతండ్రియు గుఱ్ఱలచట నెఱితోనున్నా
రోతొయ్యలి నిన్నును ఱే
డైతగునలు నరసికాంచి యరుదేరంగ౯.

గీ. నన్ను నీతండ్రియని చిన నిన్న నిటకు
నరుగుదెంచి యీ యూరెల్లనరసియరసి
నిన్ను గనగంటినిచ్చట నేడునాదు
గోర్కులెల్లగొనసాగెగొదలుడాగె.