పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/475

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయా శ్వాసౌము

  నన సిగ్గుదొలకాడ నాలోనగొండొక
క్రొత్తయౌకత యల్లుకొనికడంగి
నాతుక నాకేల నాతుక కేనేల
నన్నుగన్గొని రేని నగనె చెలులు

తొల్లియొకలెంక తనయింతిదొలగియుండి
తల్లడిల్లిన తెఱ గేనుదలచుకొంటి
నంతయేకాక నేనేడయింతియేడ
యనుచుదనగుట్టులో లోననడచెనతడు.

క. అక్కరణి న్నలుడుండగ
నిక్కడ నల్లుడుగూతు రెందులజనిరో
యక్కటయనియెద దలకుచు
గ్రక్కునగ్రధకై శికుండు కడునెరడరన్

గీ. సరగనిద్దఱరో యంగ జన్నిగట్ల
నల్దెశలకంచె దెచ్చిన నగకునూళ్ళు;
గొల్లగానొసంగుదు నంచు నెల్లరకును
దెలియగాజేసి యాసలు చెలగజేసి.

క. నేలంగల యూళ్ళన్నియు
జాలంగారోసియెందు జాననుపలుని
గాలించికొందఱు కనం
జాలక యరుదెంచి రిండ్ల చక్కికిదిరుగన్

క. తక్కటి కొందఱు నలుజెలి
నెక్కడనుంగానకూర కిండ్లకురా లో
నొక్కింతయునొల్లక కడు
నక్కఱతో దిరిగిచుండి రందందుదగన్.