Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/474

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠనిర్వచన వైషధము

శా. ఎచ్చోట న్ననుగాన కారయుచు నేనేతేరగా గానలో

నచ్చోనొంటిగనుండి యితలుకుతో నానాడెవంగుందితో
నిచ్చల్నన్నుదలంచి కానలగడుంజీ కాకులతో నుండితో
హెచ్చౌరాయిడి నొందజాల కకటా యొందైననందీల్గితో.

క. తల్లిదండ్రుల జేరితొ లే

కెలనాగరొ కానలేక యొందైనం జి
క్కులుగుడుచుచుంటొ యెట్లీ
యలజడి నేనీగగందు నక్కటానెలతా.

గీ. ఇరులగనుగొన్న నీసోగ కురులతీరు

దొగలజూచిన నీకనుదోయిడాలు
నింగిగాంచిన నీకౌనునిండుహొయలు
నెదకు దోచెడు నింక నేనెట్టులోర్తు.

చ. అనుచు దలంచు చున్నతఱి నందలి లెంకయొకండు కొంత చెం

తనిలిచియాలకించి నలిదారసిలం జనుదెంచి చూచి యీ
చినిగినగుడ్దలుం గుఱుచచేతులు గూనును సొట్ట కాళ్లు గ
ల్గినయితనాలు నీతనిని గెల్చినచక్కన దంచు దద్దయున్ .

గీ. గేలిసేయుచు నగుచు జాల్చాలునితని

గనులనేరైన నొకసారి కనిరయేని
రేయికలలోననేతెంచు నీయనసొగ
పట్టులయ్యునునింతికై యడలదొడగె.

సీ. అనియెదననుకొని యరుదెంచియాతని

గనుగొనియిట్లనె నెనరుతోడ
నీఇతలంచినయట్టి నెంతకుననీకును
నెడయాట కటకటా యేలకలిగె.