పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/477

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయా శ్వాసము

క. ఎన్నడు చెలులంగలసెదొ

యెన్నడు తొల్లింటియట్టు లెనలేనిసిరుల్
చెన్నుగ నందెదొ యెన్నం
డన్నలతో గూడదండ్రియలరుచుగనుగో

క. నీయెదలో నించుకయును

నా యానకలకయుడుగు నన్నెఱుగుడె త
ల్లీ యేనుజన్ని గట్టను
జేయడయని నీదుతండ్రి చెలికాడనన౯.

క. తన కొడుకుగూతు దలచుక

కనుదోయిన్నీరునించి కలచుట్టల నె
ల్ల నడిగి యేడ్చుచునున్నం
గనుంగొనిసునందలోనుగా గలకలుకుల్.

ఉ. ఏలొకొ యింతియిక్కరణి నేడ్చుచున్నది చూచిరాదగు౯

జీడియలార రండనుచు జెచ్చెర డగ్గఱ జేరి రందులో
జాలిని దల్లిచెంగటికి జయ్యననేగి సునందచక్కగా
జేలనుచేర్చుచుం దెలియజేసిన నాయెలనాగక్రచ్చఱ౯.

క. చనుదెంచి తద్దయును నెన

రెనయంగా గూరుచుండి యెద్దియెచెలితో
ననుచుండునేల జేజే
గనియరుదెంది కడుతియ్యగా నిట్లనియె౯.

ఉ. తొంటితెఱంగ దెట్టియది తొయ్యలితండ్రియు నెందునుండు నే

యింటనుజొచ్చె నిక్కరణి నిచ్చటకుంజనుదెంచి యొంటిగా
నుంటకునెద్దికీలెచటనుందురు చుట్టలు తల్లిదండ్రు ల
న్నింటను జాలియుండుదురె నెట్టనదాచక యానతీయరే.