పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/471

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయా శ్వాసము

గీ. అతడును నలునకు జోహారొనర్చియనియె

నేనొక జడదారి కెగ్గుచేసి
కదలనేరకుంటి గర్కోటకుండండ్రు
నన్ను నగ్గిగదిసె నాల్గుదెసల.

క. ఇందుండి కెడయజాలను

సందిట నన్నెత్తికొనుచు సాగిచనికొలం
కెందున్ననచటానూఱట
చెందగ నన్నుంచ లగ్గు సేయుదునీకున్ .

గీ. అనిననింతంతయనరాని నెనరుతోడ

దన్ను గొనియేగగనొడలతందుకుంచి
చులకనైన యుండ దఱిజేరి యళుకులేక
యెత్తుకొనికారుకానలోనేగితేగి.

సీ. కొంతకురంగట గొలకొండుగని దాని గట్టునడించంగ గడగజూ యింతతొందరయేల యింకనన్నో ఱేడ యీరైదడుగులు గొంచేగియచట డించిననీకుగడిందిలగ్గొనరింతు ననుడునడుగులెన్ని కొనుచునరుగ గర్కోటకుడుఱేని గఱిచియిట్లనెనన్న నిన్నేనుగఱుచుట యెన్నరాని

కీడుగదలంచి యదలోననోడకింక దొంటిసిరి చెడికాన నిట్లుంటనినన్ను నొరులెఱింగిన నెగ్గగునోయటంచు నీసొగసుదూలగఱచితి నీసులేక.