పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/470

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ట్యనిర్వచన నైషధము

<poem>గీ.తల్లినీయొద్ద నన్నుంచఁ దలఁచితేని కడఁగినానేర్చునట్లు రాకన్నియలకు ననలుగై సేయు నింతినై నగళులందు నుండుదాననొండైన నేనుండనిచట.

క.ఒడయనిరోయంగాఁ జనఁ దొడఁగిన యాజన్నిగల్లుతోఁ దక్కఁగనీ యడుగాన లాఁతులంగని నుడియొక్కటియైన నాడనొల్లనుదల్లీ.

గీ.కాళ్ళుగడుగనెంగిలియంటఁగాదునాకు నట్టులైనను నీయొద్ద గుట్టుచెడక యుందుననిననీకొని తనయొద్దికూఁతు రగునునందచెంగటనుండనానతిచ్చె.

క.నిచ్చలునలు నెదఁదలఁచుచు నిచ్చటనెలనాగయొండ నెడసిచని నలుఁ డచ్చటఁగానలఁదిరుగుచుఁ జెచ్చెరఁదిలకించె నొక్కచెంతనుగానన్.

మత్తకోకిల.కొండదాఁకుచుఁ జెట్లఁగాల్చుచుఁ గూడితద్దయుఁగారుచి చ్చెండగాయుచు నుండఁగాఁగడు హెచ్చిచుట్టుకొనంగలో నుండునాగులఱేఁడొకండిదె యోనలుండ యొకింతనే గండడంగకయుండ గ్రక్కునఁ గాచియేలఁగదేయనన్.

చ.ఒనరఁగనాలకించి యతఁడొయ్యన డాయఁగ నేగి యందులోఁ గనుఁగొనెఁజుట్టుచుట్టుకొని కన్నులనీ రొలుకంగ నేడ్చుచున్ నెనరునఁజిచ్చులోనడఁగి నీల్లకయుండఁగ నన్నుఁదీయ గ్ర క్కుననిటురాఁగదయ్య యనికుయ్యిడుత్రాఁచులఱేని నొక్కని౯.