ఈ పుట ఆమోదించబడ్డది
శుద్ధాంధ్రనిరోష్ఠ నిర్వచన వైషధము
క. నాకోఱల చేదెన్నా
- ళ్ళీకొనినీయెడలనుండు నికనన్నాళ్ళున్
- నీ కేకడ నేచేదును
- దాకదునిను జెనకలేరు దాయలునింకన్
గీ. కొన్నినాళ్ళకుదొల్లింటిచెన్ను గలిగి
- యాలంతో గూడుకొని సిరుల్ చాలగుడుతు
- తొంటిసొగసూని తిరుగనీకుంతయిచ్చ
- యైననన్నుదలచునదియంతలోన.
గీ. చీరయొకటి నిన్ను జెచ్చెరజేరును
- దానిగట్టజక్క నౌనునొడలు
- తగునయోధ్య యనగ దనరునూరొక్కటి
- యెంచిచూడనెందు నీడు లేక.
క. తగునైదైదుల రెండయి
- సొగసగు తెనుగచ్చరాన నూటియెసంగన్
- దగితెడుతుర్ణులసందు గ
- లిగిన ఋతుర్ణుడనుఱేడు లెస్సగనచటన్.
గీ.అతనిగొలిచియుండి యతనికి గుఱ్ఱాల
- దోలుజూడాయెల్ల దొలుతనొసగ
- జెట్లయాకులలరు జేరకలెక్కించు
- తెఱగునీకతండు తెలియజేయు.