Jump to content

పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శుద్ధాంధ్రనిరోష్ఠ్యనిర్వచన నైషధము

  క . చదలునఁదేరులునిచితిగ
గదలిదొరలలోనఁ దేజుకడునలరంగా
గుదురుగఁగూర్చుండినదొర
యెదుటకునరుదెంచి యెల్లరిట్లనిరొకట౯.

ఉ . ఓదొరకల్లలన్నఁ గననొల్లట నిన్నెదలందుగట్టిగా
గాదిలినెయ్యుఁగాదలఁచి కంగొనఁగాఁ జనుదెంచిరిట్లుజే
జేదొకలెల్లఁగోరికలు చేఱఁదీరిచెదంచుఁ దీర్చిదే
నాదటనీకత ల్నలుగుకౌనన నెన్నికగాంచు నెల్లెడ౯.

గీ . అనినఁగన్నుల నగుచునుననియెనలుఁడు
నట్లచేసెద నీరునన్నడుగుదాని
నీతెఱంగెద్ది యితఁడెందు పిలుచు నతని
కెద్దిచోటుతక్కిన యాతఁడేఁడు తెలియఁ
జేయఁదగునున్నఁ దెఱగంటిరాయఁడనియె .

క . నేజేజేయొడయండను
దేజెపఁగునితఁడితఁడితఁడుదెనయేలికాలే
యోజనుదీర్చెదొయందఱ
జేజేలకడిందికోర్కి చెదరనికడఁకన్ .

గీ . అనుటకెదలోనఁగడునలుఁడలరియనియె
నింతకంటెనొండున్న దేయొందుజూడ
దెలియఁజేయుఁడుకోర్కులుతేటగాను
నునుగులైనను నిచ్చెదనోడకింక .

క . అడిగెడునాతఁడుజేజే
యొడయండఁట చేకుఱంగనొనరుచు నాతం
డడుగకయెయొపఁగునలుఁడఁట
తడయక కడతేర్చు నెంతదానినినైన౯