పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ప్రథమాశ్వాసము

క . నీయానతికలుగుటచేఁ
జేయుదునెజ్దానినైనఁ జెచ్చెర జేజే
రాయఁడనేనింకసరకు
నేయుదునే నింగియొఱగి సిగఁగూలినయేన్ .

గీ . అనిననట్టిదిట్టమౌడెఱిఁగియకాదె
యొరునినొకనినడుగ నొల్లకీటకు
నిట్లునిన్నుగోర నిందఱు జేజేలు
నరుగుదెంచియుంట యరసిచూడ .

గీ . సరగనీయూరిరాకన్నె సరసకరిగి
యచటనీనలుగురఁ గొనియాడి నేర్చి
నట్లునోరోడకన్నియు ననఁగఁదగిన
యట్లయాడియొక్కనిఁగోరునట్లుసేయు .

మ . అనిజేజేదొరయన్న నన్నలుఁడు నాహాయింతజేజేలకుం
జనునే కాదన కేనెకోరికొను చానంగూర్చియేతేరఁ జ
క్కననన్నేచన నానతిచ్చుట యెదంగ్రాల్గంటినేఁగోరియుం
టనునేనెట్లు చనంగనేర్తునిఁకఁ గట్టా జల్ల కెట్లోర్చెదన్ .

క . అనిజేజేరాయనిగనుఁ
గొనియెదయురి యాడుచుండఁ గుందుచునయ్యా
ననుసేఁగోరిన చెలికడ
కనుచుటనీయట్టిదిట్ట కగునేయనిన౯ .

గీ . తొలుతఁజేసెదననియాడి తుదకుఁజేయ
నంచుఁగల్లలాడఁగ నౌనెయకటనీకు
లెస్సగాదెజేజేలకు లెస్సచేయు
టాడిదాఁటిన నేరికినౌనెలగ్గు .