పుట:కందుకూరి వీరేశలింగం కృత గ్రంథములు.pdf/427

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
లంకా ద్వీపము

మును భయపడక నన్నువిడువక యక్కడ నుండి యెక్క యంగ వేసి యెగిరి సువేలాద్రిమీదిఁకి దుమికెను. ఆవానరుఁడు గంతువేసిన స్ధలమునకు నువేలాద్రి నాలుగు యోజనముల దూరములో నున్నదని నేనంతకుముందే మందోదరివలన నెఱఁగియున్నామ. మర్కటము నన్ను వెన్నునఁ బెట్టుకొని కుప్పించి యుఱకఁబోవునప్పుడు దైవమాత చేత నాకొక్క యాపులింతవచ్చినది. పూర్వాచారపరాయణుఁడు నగుట చేత పెద్దల యాచారమును మీఱరాదని నేనప్పుడు కొఁడంత యాపదలో నున్నను నాయాపులింత పోవువఱకును చిటికలు వేయుచుంటిని ఆకోఁతితో నేను సువేలాద్రిశిఖరమున వాలునప్పటికి లెక్కవేయఁగా నాచిటికలు సరిగా పడియైనవి. ఆలెక్కను బట్టి పది చిటికలు కాలములో వానరము నాలుగు యోజనములు దూరము దుముకునని నేను తెలుసుకొంటిని. అప్పుడు నేను ముందువంకఁ జూచునప్పటికి నాయెదట లవణసముద్రము మేఘమండలములనంటు తరంగములతోను మేఘనాదములతో వియ్యమందు సంతతధ్వనితోను భయంకరముగాఁ గానఁబడెను. వానర మింక ముందు వంకకు పాఱిపోవుట కనకాశము లేనందున నలుగురువచ్చి చుట్టువేసి నన్ను దక్కించుకొని మహాకాయమున కియ్యవచ్చునని నాలోనేను సంతోషపడుచుంటిని. ఇట్లు నేను మనోథర సామరాజ్యానందము నొందుచుండగానే వానరము కుప్పించి ముందువంక కుఱుకుట కుద్యుక్తమయి యున్నట్లు కనఁబడెను. అంసుచేత నేనీసారి యెంత దూరము దుముకునో చూడవలె నన్నుయుత్సాహముచేత ముందు సముద్రమన్న మాట మఱచి పోయి చిటికలు వేయుటకు మొదలుపెట్టితిని. ఇన్నూటయేఁబది చిటికలు లెక్కపెట్టునప్పటికి వానరము నన్నుగొని సముద్రమున కావలి యొడ్డుననున్న యొక విశాలమైన యిసుకతిప్పిలో వ్రాలినది. అప్పుడు నేను గణిత శాస్త్ర ప్రకారము లెక్కవేసి యిన్నూటయేఁబదింటిని పదింటిచేత